గణపతులు రకాలు
గణపతులు రకాలు
ఏక దంత గణపతి –పెద్ద పొట్ట తో నీలి దుస్తులతో అజ్ఞాన బంధ విచ్చేదకమైన గొడ్డలితో,జపమాల ,లడ్డూ లతో దర్శన మిస్తాడు
ద్విముఖ గణ పతి –రోమన్లు ఈ గణేషుని ‘’జెనస్ ‘’అంటారు .రెండు ముఖాలతో అన్ని వైపులా చూస్తాడు .అంకుశం పాశం కిరీటం ధరించి ఉంటాడు
త్రిముఖ గణ పతి –స్వర్ణ పద్మాసనస్తితుడైఎరుపు రంగులో మూడు ముఖాలతో దర్శన మిస్తాడు అమృత భాండం ,పాశం ఉంటాయి కుడి చేయి వరద హస్తం ఎడమ చేయి కోరికల నిచ్చేది .
సింహ గణ పతి –సింహం పై కూర్చుని తెల్లగా ఉంటాడు .శక్తి నిచ్చి భయం లేకుండా చేస్తాడు .కల్ప వృక్ష శాఖ ,పద్మం ,రాత్నాలున్నపాత్ర ,వీణ ధరించి ఉంటాడు
యోగ గణపతి –స్తిరం గ కూర్చుని మంత్రం జపం లో ఉంటాడు కాళ్ళకు ఉత్తరీయం ముడి వేసుకొని ఉంటాడు .యోగ దండం, చెరకు గడ రుద్రాక్ష మాల ,ఆయుధం ధరించి ఉంటాడు ఉదయ సూర్యుని కాంతి తో కనిపిస్తాడు ..నీలి వస్త్రాలు ధరిస్తాడు .
దుర్గా గణ పతి –చేతిలో కాషాయ ధ్వజం విజయ చిహ్నం గా చీకటి నుంచి వెలుగు కు ప్రస్తానం గా ఉంటుంది .బంగారు రంగు ఛాయ ..యెర్రని వస్త్ర ధారణా .చేతిలో విల్లు బాణం ,అంకుశం ,జపమాల .యెర్రని విరిగిన దంతం తో ఉంటాడు .
సంకట హర గణపతి –దుఃఖ నివారకుడు .ఎర్రర కలువ పై ఆసీనుడై ,అన్నం పాత్ర ,పాశం అంకుశం ధరించి వరద ముద్రతో నీలి రంగు వస్త్రాలు ధరించి కనీ పిస్తాడు .
ఏకాక్షర గణపతి –మూడు కళ్ళతో ఎర్రగా యెర్ర వస్త్ర ధారణ లో ఉంటాడు శిరస్సు పై ఉదయ చంద్రుని ధరిస్తాడు .మూషిక వాహనం పై పద్మాసనం లో కూర్చుని ఉంటాడు. దానిమ్మ ,పాశం అంకుశం ధరించి అభయ దాయకం గా దర్శన మిస్తాడు .
వరద గణ పతి -.మూడవ కన్ను జ్ఞాన నేత్రం .తేనె పాత్ర ,పాశామ్కుశాలతో తొండం లో వజ్రాలతో ఉంటాడు .ఆయన శక్తి తొడమీద ఆసీనయై ఉంటుంది .ఉదయ చంద్రుడు శిరస్సు పై ఉంటాడు
వరద గణ పతి –అ ఉ అం అనే ప్రణవాత్మక గణపతి .బంగారు వర్ణం తో .శూర్ప కారకర్ణాలతో ,విరిగిన దంతం పాశామ్కుశాలతో ,మామిడి పండుతో ,మోదక భక్షణ చేస్తూ ఉంటాడు
క్షిప్ర ప్రసాద గణ పతి –కోరిన వెంటనే కోర్కెలు తీరుస్తాడు కనుక క్షిప్ర ప్రసాద గణ పతి అయ్యాడు .దర్భాలున్న ఆసనం పై ఉప విస్టూడు .బాన పొట్ట ఈ విశ్వానికి సంకేతం .పాశం అంకుశం దానిమ్మ కలువ పువ్వు దంతం,కల్ప వృక్ష శాఖ కలిగి ఉంటాడు
హరిద్ర గణపతి –బంగారు చాయతో పచ్చని వస్త్రాలు ధరించి ఉంటాడు .సింహాసనం పై ప్రశాంతం గా కూర్చుని ఉంటాడు .మోదకం ,దంతం పైకెత్తిన పాశామ్కుశాలతో ఉంటాడు
.

No comments: