Slide show

[people][slideshow]

శ్రీ వేంకటేశ్వర స్తోత్రము.....తాత్పర్యంతో

శ్రీ వేంకటేశ్వర స్తోత్రము.....తాత్పర్యంతో🌼🌼🌼 

కమలాకుచ చూచుక కుంకుమతో
నియతారుణితాతుల నీలతనో
కమలాయతలోచన లోకపతే
విజయీ భవ వేంకటశైలపతే ||
సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ
ప్రముఖాఖిలదైవత మౌళిమణే
శరణాగతవత్సల సారనిధే
పరిపాలయ మాం వృషశైలపతే ||
అతివేలతయా తవ దుర్విషహై
రనువేలకృతై రపరాధశతైః
భరితం త్వరితం వృషశైలపతే
పరయా కృపయా పరిపాహి హరే ||
అధివేంకటశైల ముదారమతే
ర్జనతాభిమతాధిక దానరతాత్
పరదేవతయా గదితా న్నిగమైః
కమలాదయితా న్న పరం కలయే ||
కలవేణురవావశ గోపవధూ
శతకోటివృతాత్ స్మరకోటిసమాత్
ప్రతివల్లవికాభిమతా త్సుఖదాత్
వసుదేవసుతా న్న పరం కలయే ||
అభిరామగుణాకర దాశరథే
జగదేక ధనుర్ధర ధీరమతే
రఘునాయక రామ రమేశ విభో
వరదో్ భవ దేవ దయాజలధే ||
అవనీతనయా కమనీయకరం
రజనీకరచారు ముఖాంబురుహమ్‌
రజనీచరరాజ తమోమిహిరం
మహనీయమహం రఘురామమయే ||
సుముఖం సుదృహం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయ మమోఘశరమ్‌
అపహాయ రఘూద్వహ మన్య మహం
న కథంచన కంచన జాతు భజే ||
వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేకటేశ ప్రయచ్చ ప్రయచ్చ ||
అహం దూరత స్తే పదాంభోజయుగ్మ
ప్రణామేచ్చయా గత్య సేవాం కరోమి
సకృత్సేనయా నిత్యసేవాఫలం త్వం
ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వేంకటేశ ||
అజ్ఝానినా మ్యా దోషా నశేషా న్విహితాన్‌ హరే
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైలశిఖామణే ||
తాత్పర్యము:
లక్ష్మీదేవి స్తన్యముల కుంకుమ వలన ఎరుపెక్కిన శరీరము కల నీలమేఘ శ్యాముడు, కమలముల వంటి కన్నులు కలవాడు, లోకపతి అయిన వేంకటాచల పతికి విజయము కలుగు గాక.
బ్రహ్మ, మహేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు మొదలైన దేవతలలో శిరోమణి యైన, శరణు కోరిన వారి పాలిటి వాత్సల్య సారమునకు నిధి వంటి వృష శైలపతి అయిన వేంకటేశా! నన్ను కాపాడుము.
ఓ వృషాద్రి పతీ! శ్రీ హరీ! అనేక పాపములు, తప్పులు చేసినందుకు చింతించుచు, శరీరము వణుకుచు, నీ శరణు కోరుటకు నీ వద్దకు వేగముగా వచ్చితిని. నీ అపారమైన కృపను నాపై కురిపించుము.
ఓ లక్ష్మీ పతీ! స్వతహాగా కరుణా సాగరుడవై వేంకటాచలముపై యున్నావు , కోరిన వారికి అడిగిన దానికన్నా ఎక్కువగా ఇచ్చెడి వాడవు, దేవతలచే పూజించ బడిన వాడవు, వేదములకు సారము, గతి యైన నిన్ను మించిన దైవము లేదు.
వేణు రవముతో గోపికలను సమ్మోహనం చేసే, శత కోటి తపస్సులను, అనేక కోట్ల ఇతర దేవతల కొలువును మించి ప్రతి ఒక్క గోపిక అభిమతము నెరవేర్చి వారికి సుఖమునిచ్చిన వసుదేవ తనయుడవైన నీకు సమానమైనది ఏదియును లేదు.
సకల గుణాభిరాముడు, దశరథ తనయుడు, జగత్తులో కెల్లా ఉత్తముడైన ధనుర్ధారి, ధీరుడు, రఘు వంశములో జన్మించిన, రమాపతి యైన ఓ రామా! దయా జలధీ! నాకు వరములిమ్ము.
సీతాదేవి చెట్టపట్టిన అందమైన చేతులు కల, చంద్రుని వలె, కలువ వలె అందమైన ముఖము కల, నిశీధిలో రాజు వలె సంచరించి సూర్యుని వలె అంధకారాన్ని నాశనము చేసే ఓ రఘు రామా! నీ శరణు కోరుతున్నాను.
ఓ ప్రభూ! నీవు సోదరులతో అలరుతూ, అమోఘమైన శరములతో, ప్రసన్నమైన ముఖము కల వాడవు, సుహ్రుదయుడవు, భక్త సులభుడవు, సుఖమునిచ్చే వాడవు. ఓ రఘు వంశోత్తమా! కావున నిన్ను విడచి, ఒక్కసారి, ఒక్క క్షణము కూడా నేను వేరేవ్వరినీ ప్రార్థించను.
వేంకటేశుడు తప్ప నాకెవ్వరు నాథుడు లేడు, నాథుడు లేడు. నేను ఎల్లప్పుడూ వేంకటేశునే స్మరింతును, స్మరింతును. కావున ఓ వేంకటేశా! హరీ! నాపై దయ చూపి నీకు తగినది, ప్రియమైనదే నాకు ప్రసాదించుము, ప్రసాదించుము.
ఓ వేంకటేశా! నీ పాద పద్మముల సేవకై ఎంతో దూరమునుండి నేను వచ్చితిని. కావున ఓ ప్రభూ! నీ సేవ చేసుకునే భాగ్యమును నాకు ప్రసాదించుము, ప్రసాదించుము.
ఓ శేష శైల శిఖామణీ! నేను అజ్ఞానముతో, నిస్సహాయతతో చేసిన అశేషమైన దోషములను హరించి, నన్ను క్షమించుము, క్షమించుము.

No comments:

vehicles

[cars][stack]

business

[business][grids]

health

[health][btop]